Site icon NTV Telugu

NRI loses Rs 4 crores: రూ.4 కోట్లు క్రిప్టో కరెన్సీ మోసపోయిన ఎన్నారై

Download

Download

మోసాలు చేసేవారికి దేశంలో వున్నవారైనా ఒక్కరే.. విదేశం నుంచి స్వదేశానికి వచ్చినవారైనా ఒకటే. అమెరికా నుంచి హైదరాబాద్‌ కి వచ్చేలోగా నాలుగు కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. విమానంలో ఉండగానే నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ లాగేశారు. అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్ వాసి లబోదిబో మంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడంతో ఈమోసం బయటపడింది. అమెరికాలో సెటిల్ అయి.. ఇటీవల కాలంలో క్రిప్ట్ కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మాడో శ్రీనివాస్ అనే ఎన్నారై. తన సంపాదన మొత్తాన్ని పెట్టి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీగా మార్చాడు.

సింగపూర్ కు చెందిన బి బ్యాక్స్ అనే బ్యాంకు లావాదేవీలతో నిర్వహించాడు. తన తల్లి ఆరోగ్యం పాడవడంతో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫ్లైట్ లో ఉండి ఇండియాలో దిగేటప్పటికే అతనికి చెందిన క్రిప్టో కరెన్సీ మాయమైపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా తన దగ్గర ఉన్న క్రిప్ట్ మొత్తాన్ని బ్యాంకు అమ్మి వేసిందంటూ ఆరోపణ చేశాడు. తాను విమానంలో ఉన్న సమయంలోనే ఈ లావాదేవీలు జరిగిపోయాయని లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ శ్రీనివాస్‌ రూ.6 లక్షల యూఎస్‌డీటీ(భారతీయ కరెన్సీలో సుమరు రూ.4 కోట్లు) పొగొట్టుకున్నట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిప్టో కరెన్సీని దాచే సింగపూర్‌కు చెందిన బీబాక్స్‌ బ్యాంకులో శ్రీనివాస్‌కు ఖాతా ఉంది. అందులో రూ.3 లక్షల యూఎస్‌డీటీ విలువ చేసే క్రిప్టో ఉంది.

ఇండియాకు వచ్చిన తరువాత ఆయన బీబాక్స్‌ ఖాతా హ్యాక్‌ అయింది. బాధితుడి వద్ద హైసెక్యూరిటీ ఉన్న ఐ-ఫోన్‌ ఉంది. తన ఖాతా నిజంగానే హ్యాక్‌ అయితే ఓటీపీలు, ఎస్‌ఎంఎస్‌లు రావాల్సి ఉన్నా రాలేదు. మెయిల్‌ ఐడీ హ్యాక్‌ కాలేదు. కాబట్టి బీబాక్స్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ వారి పొరపాటుతోనో, లేదా అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరైనా ఇది చేసి ఉండవచ్చని బాధితుడు పోలీసుల ముందు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, తన ఖాతా హ్యాక్‌ ఎలా అయింది, ఎవరు యాక్సిస్‌ చేశారో వివరాలు ఇవ్వాలని జూన్‌ నుంచి బీబాక్స్‌ క్రిప్టో ఎక్సేంజ్‌ వారిని సంప్రదిస్తూనే ఉన్నా..ఎలాంటి స్పందన లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సింగపూర్‌లోని బీబాక్స్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ అసలేం జరిగిందో పూర్తి వివరాలివ్వాలని నోటీసులు పంపారు. మరి ఆ బ్యాంకు వారు ఏం బదులిస్తారో చూడాలి.

Open Doors: క్లబ్ హౌస్ తరహాలోనే మరో ఆన్‌లైన్ రచ్చబండ

Exit mobile version