Gwalior: గ్వాలియర్‌లో కాల్పులు.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కాల్పులు
- అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై వ్యక్తి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం జరిగింది. కాల్పులతో ఒక్కసారిగా దద్దరిల్లింది. నడిరోడ్డుపై ఒకరిపై కాల్పులకు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే కాల్పులు జరగడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: KCR: రాకింగ్ రాకేష్ కేసీఆర్ -‘కేశవ చంద్ర రమావత్’ రిలీజ్ ఆరోజే!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
సోని సర్దార్ అని పిలువబడే జస్వంత్ సింగ్(45) పెరోల్‌పై ఇటీవల విడుదలయ్యాడు. 2016లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దాబ్రాలోని గోపాల్ బాగ్ సిటీలో నివసించే జస్వంత్ అక్టోబర్ 28న 15 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు. అయితే గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత.. రోడ్డుపైకి వచ్చి స్థానికులతో సంభాషిస్తున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. వచ్చీరాగానే తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడే ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేదు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు
జస్వంత్ సింగ్.. మంచి ప్రవర్తన కారణంగా అప్పుడప్పుడు పెరోల్‌పై విడుదలవుతుంటాడు. ఈసారి 15 రోజుల పాటు బయటకు వచ్చాడు. అయితే రాత్రిపూట సరదాగా కాలనీల్లోకి వచ్చి తిరుగుతూ సంభాషిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. గోపాల్‌బాగ్ సిటీ ప్రవేశం దగ్గర గార్డు లేకపోవడంతో నిందుతులు సులువుగా లోపలికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
#WATCH | MP: Released Prisoner Fatally Shot By Two Attackers On Motorcycle In Gwalior#MadhyaPradesh #gwalior #MPNews pic.twitter.com/m8avkf3kN1
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 8, 2024
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!