సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టిన చంపిన ఘటన గండి మైసమ్మలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ అనే వ్యక్తి గండి మైసమ్మలోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. అయితే చెఫ్ రమేశ్ సెల్ ఫోన్ దొంగలించాడని ఆ హోటల్ నిర్వాహకుడు రాకేశ్ అనే వ్యక్తి రమేశ్‌ను తీవ్రంగా చిదకబాదాడు. రాకేశ్‌తో పాటు అతడి తల్లి భాగ్యలక్ష్మి, స్నేహితులు రమేశ్‌ను కొట్టి చంపారు. అయితే ఇటీవల పోలీసులకు దుండిగల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
మృతుడి ప్యాంట్ జేబులోని నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ విషయాలు తెలియడంతో నివ్వెరపోయారు. రమేశ్ డెడ్‌బాడీని మాయం చేసేందుకు రాకేశ్‌తో పాటు తల్లి, స్నేహితులు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా హోటల్‌ల్లోని సీసీ కెమెరాలు ఆధారంగా రమేశ్‌ను కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేశ్‌తో పాటు అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.