NTV Telugu Site icon

Crime: మైనర్ బాలికలపై అత్యాచారం.. ఒకరిని నమ్మించి, మరొకరిని అపహరించి..

Crime

Crime

Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.

బాలికతో పాటు బాలిక కుటుంబంతో నిందితుడు స్నేహం చేస్తూ నమ్మించాడు. బాలిక కుటుంబ సభ్యులు తరుచూ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ లైంగిక వేధింపులు మేలో ప్రారంభమయ్యాయి. అయితే సోమవారం ఇదే విధంగా చేయడానికి ప్రయత్నించిన సమయంలో బాలిక అందుకు అడ్డు చెప్పింది. దీంతో నిందితుడు ఆమెను కొట్టి బెదిరించినట్లు అధికారులు తెలిపారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయ న్యాయ సంహిత మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్‌ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!

రాజస్థాన్‌లో 15 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్:

జోధ్‌పూర్‌లో ఇంటి నుంచి తప్పిపోయిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వెనక ఉన్న డంప్ యార్డ్‌లో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం రాత్రి బాలిక మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి చేరుకోగానే ఆమెపై అత్యాచారం జరిగినట్లు జోధ్‌పూర్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అత్యాచార ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పి్స్తున్నారు.