Site icon NTV Telugu

Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..

Minor Girl Ganrape

Minor Girl Ganrape

Minor Girl Gangraped By 3 Boys In Rajasthan: రాజస్థాన్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి ఆమెను ఎత్తుకెళ్లి, జ్యూస్‌లో మత్తు మంది కలిపి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆపై ఆమెని ఒక చోట వదిలేసి, ఆ దుర్మార్గులు వెళ్లిపోయారు. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి

బార్మర్ జిల్లా శివ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఈ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన ముగ్గురు యువకులు.. ఏదో సాకుతో ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి, తమ కారులో కూర్చోబెట్టుకున్నారు. ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆ బాలిక అపస్మారక స్థితిలో వెళ్లిపోయింది. అప్పుడు ఆ ముగ్గురు యువకులు ఆమెను జైనారాయణ్ వ్యాస్ యూనివర్శిటీ క్రీడా మైదానానికి తీసుకెళ్లారు. ఎవ్వరూ సంచరించిన ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండటం వల్ల.. వారిని ప్రతిఘటించలేకపోయింది. అత్యాచారం చేసిన తర్వాత.. ముగ్గురు యువకులు ఆ బాలికని ఒక ప్రాంతంలో పడేసి, కారులో పారిపోయారు.

Husband Caught Wife Cheating: ఢిల్లీ మెట్రోలో ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. రివర్స్‌లో దాడి

బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత.. తనకు జరిగిన ఘాతుకాన్ని తలచుకుని మనోవేదనకు గురైంది. వెంటనే ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. బాధితురాలి విషాదం విన్న తర్వాత ఖంగుతిన్న కుటుంబసభ్యులు.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై పోక్సో సహా ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని.. వివిధ బృందాలుగా పోలీసులు విడిపోయి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version