Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట పాము కాటుతో సహజ మరణంగా భావించిన ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుడు కలిసి రచించిన పక్కా హత్య కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భర్తను అడ్డుగా భావించిన భార్య, రూ.20 లక్షల జీవిత బీమా డబ్బు కోసం ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు విషయాన్నీ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహసూమా ప్రాంతానికి చెందిన అతుల్ పంవార్ హస్తినాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ కృష్ణ కిడ్స్ ప్లే స్కూల్ నిర్వహించేవాడు. ఏడేళ్ల క్రితం దామిని అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అతుల్ మృతిచెందిన తర్వాత భార్య దామిని పోలీసులకు చెప్పిన కథనం ప్రకారం.. రాత్రి భర్త, కుమారుడు ఒకే మంచంపై నిద్రపోయారని, అర్ధరాత్రి వేడి ఎక్కువగా ఉండటంతో కుమారుడిని తీసుకుని మరో గదిలోకి వెళ్లి పడుకున్నానని తెలిపింది. ఉదయం టీ తీసుకుని వచ్చేసరికి భర్త మృతదేహం మంచంపై ఉండగా, పక్కనే నల్లపాము కనిపించిందని చెప్పింది. గ్రామస్థులు ఆ పామును పట్టుకుని ఓ బాక్స్‌లో బంధించారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
అతుల్ మృతి చెందిన విషయం తెలుసుకుని వచ్చిన కుటుంబ సభ్యులకు ఈ ఘటనపై అనుమానం కలిగింది. మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన వారు ఇది సహజ మరణం కాదని, పక్కా హత్యేనని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం ఉన్న మంచం వద్ద నుంచి యూరిన్‌తో పాటు ఇతర జీవ ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో లభించిన ఆధారాలు పోలీసుల అనుమానాలను బలపరిచాయి.
ఈ కేసు విషయమై మీరట్ ఎస్ఎస్పీ అవినాష్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో దామిని నేరాన్ని అంగీకరించింది. ఆమెకు అదే స్కూల్లో పనిచేసే బస్సు డ్రైవర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని, అందుకు అడ్డుగా ఉన్న అతుల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతుల్ పేరుపై రూ.20 లక్షల జీవిత బీమా పాలసీ ఉండటం కూడా ఈ హత్యకు ప్రధాన కారణంగా గుర్తించారు. బీమా డబ్బు పొందడంతో పాటు కలిసి జీవించాలనే ఉద్దేశంతో భార్య, ఆమె ప్రియుడు ఈ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో కూడా అతుల్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భార్య దామిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!