BIG NEWS : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలుత గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్టు అనుమానించిన పోలీసులు, దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం… ఈ హత్యకు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు అనుమానాలు బలవుతున్నాయి. అనిల్‌కు ఆ యువనేతతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో అనిల్ రూ. కోటి డిమాండ్ చేశాడని సమాచారం. డబ్బులు ఇవ్వకపోవడంతో అనిల్, ఆ నేత మనవడి బెంజ్ కారు లాక్కొని వచ్చినట్టు సమాచారం.
Off The Record: బొమ్మరిల్లు ఫాదర్ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు?
హత్యకు ముందు రోజు అనిల్ గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై, అనంతరం బంజారాహిల్స్‌లోని ఓ రియల్టీ కార్యాలయానికి వెళ్లి గొడవపడ్డట్టు తెలుస్తోంది. అదే సమయంలో అనిల్‌ను హైద్రాబాద్ నుంచి రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు వెంబడించారని విచారణలో వెల్లడైంది. ఇంకా కీలక విషయమేమిటంటే, అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ హత్యా గ్యాంగ్‌కు తుపాకులను కూడా అదే ఎమ్మెల్యే మనవడే సమకూర్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి, సంబంధిత వ్యక్తులను పలు ముళ్లతో ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీల మధ్య అనుబంధం ఈ హత్యకు దారితీసిందా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రావచ్చునని పోలీసులు పేర్కొన్నారు.
Off The Record: బొమ్మరిల్లు ఫాదర్ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు?