Digital Arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్ ప్రధాన సూత్రధారి అరెస్ట్
- డిజిటల్ అరెస్ట్ స్కామ్ ప్రధాన సూత్రధారి అరెస్ట్
- చిరాగ్ కపూర్‌ను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట డిజిటల్ అరెస్ట్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి.. అమాయకుల బలహీనతను అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగి లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తున్నారు. అనంతరం బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వరుసగా డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువైపోయాయి. దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో పదులకొద్దీ కేసులు నమోదవ్వడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తాజాగా కోల్‌కతా పోలీసులు.. డిజిటల్ అరెస్ట్ స్కామ్ సూత్రధారుడ్ని అరెస్ట్ చేశారు.

Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి అధికారులుగా నటిస్తారు. లేనిపోని కేసులతో భయాందోళనకు గురి చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. అనంతరం మరొకరు ఫోన్ చేసి.. డబ్బులు బదిలీ చేయాలంటూ బలవంతం చేస్తారు. అలా దఫదఫాలుగా లక్షల్లో.. కోట్లలో నగదు కాజేస్తుంటారు. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోట్లాది రూపాయులు పోగొట్టుకున్నారు.
తాజాగా ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుడైన చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇతడిపై 930 కేసులతో సంబంధం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మంది వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జురిస్డిక్షనల్ కోర్టు ముందు హాజరు పరుస్తామని.. అలాగే ట్రాన్సిట్ కస్టడీని కోరతామని పోలీసులు తెలిపారు.
దేబాశ్రీ దత్తా అనే ఫిర్యాదుదారుడిని నిషేధిత డ్రగ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. దీంతో అతడి ఖాతా నుంచి రూ.47 లక్షలు దోచుకున్నారు. దేబాశ్రీ దత్తా ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంక్ ఖాతా ఆధారంగా సెప్టెంబర్ 28, 2024న కేసు నమోదు చేసి విస్తృతంగా దాడులు చేశారు. ఆనందపూర్, పటులి, నరేంద్రపూర్‌లో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో పాటు తాత్కాలిక కార్యాలయాన్ని కూల్చేశారు. 104 పాస్ బుక్‌లు, 61 మొబైల్ ఫోన్లు, 33 డెబిట్ కార్డులు, రెండు క్యూఆర్ కోడ్ మిషన్లు, 140 సిమ్ కార్డులు, 40 సీల్స్, 10 లీజు అగ్రిమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు.. స్కామ్ చేయడానికి ఈ కార్యాలయాన్ని ఉపయోగించినట్లు సమాచారం.
చిరాగ్ కపూర్ ఏజెంట్ల ద్వారా స్కామ్‌ను నిర్వహించాడని, అనుమానం రాకుండా దూరంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తదుపరి దర్యాప్తులో ఫేక్ అకౌంట్‌లను సృష్టించడానికి బాధ్యుడైన కపూర్ సహచరుల్లో ఒకరిని 2024 అక్టోబర్ 26న ఢిల్లీలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసు బృందం జనవరి 9, 2025న ఉదయం 4:30 గంటలకు బెంగళూరులో పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి మూడు రౌటర్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక ల్యాప్‌టాప్, ఒక బీటెల్ ల్యాండ్‌లైన్ ఫోన్, సిమ్ కార్డులున్న నాలుగు మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, మూడు పాన్ కార్డులు, నాలుగు చెక్‌బుక్‌లు, ఒక యూఎస్‌బీ డ్రైవ్, వివిధ కంపెనీల పేర్లతో కూడిన ఆరు రబ్బర్ స్టాంపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ట్రెండింగ్
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!