Site icon NTV Telugu

Terror Bid Foiled: భారీ పేలుళ్ల కుట్ర భగ్నం.. సిరాజ్‌ నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు

Terror Bid Foiled

Terror Bid Foiled

Terror Bid Foiled: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్‌లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి.. అవసరమనుకుంటే ప్రాణ త్యాగానికైన సిద్దపడేలా మానవ బాంబుగా మార్చాలని.. అలాగే ఉనికిని చాటుకునేలా జనసాంధ్రత ఎక్కువగా ఉన్నచోట భారీ పేలుళ్లు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా చెప్పాడట.. సిరాజ్ హైదరాబాద్‌ వెళ్లిన తరువాత గ్రూప్స్, ఎస్సై ఎంపిక పరీక్షలకు హాజరయ్యడు.. ఎస్సై కోసం రెండు సార్లు హాజరుకాగా ఎంపిక కాలేదు.. తరువాత కాలంలో ఓ కాల్ సెంటర్ లో పని చేశాడు.. అప్పుడే సమీర్ తోపాటు వరంగల్ కు చెందిన పలువురు మత పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి.. తరచూ జీహాద్ గురించి చర్చించుకునే వారు.. మనం ఎలా అనిచివేయబడుతున్నామో అన్న వాటిపై నెట్‌లో వీడియోలు ఎక్కువగా చూస్తుండేవాడని తెలుస్తోంది.

Read Also: Maharashtra: ఫడ్నవిస్ కేబినెట్‌లోకి 77 ఏళ్ల కురు వృద్ధుడు.. నేడు ప్రమాణం చేయనున్న భుజ్‌బాల్

ముస్లిమేతరులు మహిళలను ప్రేమ పేరుతో ఎలా మోసగించబడుతున్నారు.. దీనిని అందరికీ తెలియ పరిచే విధంగా ఓ గ్రూప్ నడపాలని డిసైడ్ అయ్యాడు సిరాజ్‌.. అహిం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి ముఖ్యలను చేర్చుకుంటూ వచ్చాడు.. తరువాత ఈ ఏడాది తొలిలో సిరాజ్ ఢిల్లీ వెళ్లాడు… అక్కడ ఇద్దరు మత పెద్దలను కలవాల్సి ఉండగా.. వాళ్లు రాకపోయే సరికి తిరిగి వచ్చేశాడు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేష్‌ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గొన్నాడు. సిరాజ్ కి సౌదీలో ఉన్న బీహారీలతో పరిచయం ఏర్పడింది.. అక్కడ నుంచే అన్ని డైరెక్షన్స్ సిరాజ్ రావడం మొదలయ్యాయి.. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్‌ అవుతూ వచ్చారు.. సిగ్నల్‌ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించారు.. పేలుళ్లకు సరిపడ ముడి సరుకు కొనుగోలు చేసేందుకు సిరాజ్ కు అక్కడ నుంచే డబ్బులు రావడం.. సిరాజ్ బాంబులు తయారీ చేయడం.. వాటి వినియోగంపై ఎప్పటికప్పుడు పై నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపినట్టుగా సమాచారం..

Read Also: Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..

అయితే వీటన్నింటికీ విజయనగరం సేప్ అని భావించాడట సిరాజ్‌.. పేలుడు పదార్ధాలను రెండు ఆన్ లైన్‌లో కొనుగోలు చేశాడు.. అలాగే విజయనగరం కేల్ పురంలో క్రాకర్స్ షాపు నుంచి పేలుడు పదార్ధాలను సేకరించాడు.. అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ను కొని తన గ్రూప్ హౌస్ లోని కింది బాత్ రూమ్ లో పెట్టుకున్నాడట సిరాజ్‌.. ఇలా సిరాజ్‌ నుంచి కీలక, ఆస్తికరమైన. భయంకరమైన నిజాలను పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత.. మరెన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూడనున్నాయో చూడాలి మరి..

Exit mobile version