Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 29, మే 5కు రానుపోను టికెట్లు బుక్ చేసుకున్నాడు. దీని కోసం రూ. 1.46 లక్షలను చెల్లించాడు. అయితే తన ప్రయాణ షెడ్యూల్ మారడంతో టికెట్లను క్యాన్సల్ చేసుకుని, రీఫండ్ పొందాలనుకున్నాడని, అందుకోసం సదరు ఎయిర్ లైన్స్ కు సంబంధించిన వెబ్‌సైట్ లో ఏప్రిల్ 11న ఓ ఫాం ఫిల్ చేశాడు.
Read Also: India: పాకిస్తాన్‌లో దాక్కున్న 23 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ..
ఇదిలా ఉంటే ఎయిర్ లైన్స్ నుంచి మరింత సహాయం పొందేందుకు ఎయిర్‌లైన్ హెల్ప్‌లైన్ కోసం గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో ఉన్న నెంబర్ నిజంగా ఎయిర్ లైన్స్ దే అని భావించిన బాధితుడు, అటునుంచి చెప్పిన విధంగా ఓ యాప్ ను తన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ తరువాత తన ఖాతా నుంచి రూ. 4.8 లక్షలను దొంగిలించినట్లు గుర్తించాడు. ప్రస్తుతం బాధిత వ్యక్తి మంగళవారం చితల్‌సర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ కోనసాగుతోందని, ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు.
