Site icon NTV Telugu

Hyderabad: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్.. స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం..!

Otr

Otr

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి
ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.

READ MORE: Murugadoss : సికిందర్ ఫెయిల్యూర్.. మురుగదాస్ కవర్ డ్రైవ్!

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చెస్తే.. తక్కువ టైమ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్ముతుంటారు కొందరు. ఇలాంటి వారినే టార్గెట్ చేశాడు ఓ కేటుగాడు. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తికి మాయ మాటలు చెప్పి.. స్టాక్ ట్రేడింగ్ పేరుతో నిండా ముంచాడు. పలుమార్లు విడతల వారీగా లక్షల రూపాయలు దండుకున్నాడు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. చిక్కాల సంతోష్ అనే వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన వ్యాపారికి నేహా అనే యువతిగా ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. స్టాక్ ట్రెండింగ్‌తో తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చని చెప్పింది నేహా. మాయ మాటలు నమ్మిన ఆ వ్యక్తి సంతోష్ చెప్పిన యాప్‌లో తొలుత లక్షా 70 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఇతడిని నమ్మించేందుకు ఫేక్ రిటర్న్స్ చూపించారు. లక్షా 70 వేల పెట్టుబడికి ఏకంగా 20 వేల US డాలర్లు రిటర్న్స్ గా వచ్చినట్లు యాప్‌లో చూపించారు. వీటిని విత్ డ్రా చేసుకోవాలంటే మరో 4 లక్షల 82 వేల 400 రూపాయలు చెల్లించాలని సూచించారు కేటుగాళ్లు. ఈ డబ్బు ను కూడా చెల్లించాడు. విత్ డ్రా కోసం మళ్లీ ప్రయత్నించాడు. చార్జెస్ కింద మరో 66 వేలు చెల్లించాలని సూచించారు. దీంతో అనుమానం వచ్చిన వ్యక్తి… తనకు పరిచయం అయిన నేహాను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అందుబాటులో లేరు. మోసపోయాను అని ఆలస్యంగా గ్రహించాడు. హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

READ MORE: CM Chandrababu: ఇవాళ నా జీవితంలో హ్యాపీయెస్ట్ డే.. ఎందుకంటే..?

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు… నేహా రూపంలో మోసం చేసిన వ్యక్తి చిక్కాల సంతోష్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి పలు దఫాలుగా డిపాజిట్ చేసిన డబ్బు కొందరు అమాయకుల ఖాతాల్లో పడ్డాయి. సంతోష్.. కొంతమంది అమాయకుల బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరాల కోసం వాడుకున్నట్లు గుర్తించారు పోలీసులు.. నిజామాబాద్‌కి చెందిన చిక్కాల సంతోష్ కుమార్ గతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ కెప్టెన్‌గా పనిచేశాడు. బయటికి వచ్చి వీసా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. అమాయక నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో కాంబోడియాకు పంపి డబ్బులు దండుకుంటున్నాడు. సంతోష్ కూడా నిజామాబాద్‌కి చెందిన ముగ్గురితో కలిసి ఉద్యోగాల కోసం కాంబోడియా వెళ్లి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరికొందరు మోసపోయేలా చేయాలని క్రూరంగా ఆలోచించాడు సంతోష్. ఇంకేముంది అనుకున్నదే తడవుగా స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం చేయడం షురూ చేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు.

Exit mobile version