NTV Telugu Site icon

UP Crime: భూ వివాదంలో పొరుగువారిని ఇరికించేందుకు కూతురి హత్య..

Up Crime

Up Crime

UP Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. భూ వివాదంలో ఇరుగుపొరుగు వారిని ఇరికించేందుకు ఓ తండ్రి కన్న కూతురినే హతమార్చాడు. ఈ ఘటన ఖుషినగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నలుగురు పిల్లల్లో చిన్నదైన కూతురు గొంతు కోసి హత్య చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. తన 16 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన దాదాపు రెండు వారాల తర్వాత మంగళవారం నిందితుడు జయనారాయణ్ సింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Bitcoin: క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు సరికొత్త ఊపు.. ట్రంప్ ఎన్నిక తర్వాత బిట్‌కాయిన్ ఆల్‌టైం రికార్డు

నెబువా నౌరంగియా గ్రామంలో నవంబర్ 1వ తేదీ రాత్రి 10వ తరగతి విద్యార్థిని హత్యకు గురైంది. నౌకా తోలాలోని తమ ఇంట్లోకి చొరబాటుదారులు ప్రవేశించారని, ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కుమార్తెపై దాడి చేశారని, ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు తన రెండు చేతులకు గాయాలయ్యాయని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు. మిగిలిన కుటుంబం ఛత్ పూజ కోసం ఇంటి నుంచి దూరంగా ఉన్నారని, ఘటన జరిగిన సమయంలో తాను తన కుమార్తె మాత్రమే ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడు.

అయితే, అనుమానించిన పోలీసులు బాలిక తండ్రిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తానే తన కూతురిని హత్య చేసినట్లు జయనారాయణ అంగీకరించాడు. చాలా కాలంగా ఆస్తి వివాదం కారణంగా తన పొరుగువారిని ఇరికించేందుకు ఈ సంఘటనకు పాల్పడినట్లు చెప్పాడు.

Show comments