IDFC First Bank scam: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో భారీ స్కామ్.. ఒక్కసారిగా షేర్లు ఢమాల్
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో భారీ మోసం..
- భారీ స్కామ్ తో ఆందోళనలో పెట్టుబడిదారులు..
- ఇవాళ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఢమాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IDFC First Bank scam: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో రూ. 590 కోట్ల మేర ఫ్రాడ్ బయటపడింది. ఈ మోసం హర్యానా ప్రభుత్వం సంబంధిత ఖాతాలతో కలిసినట్టు బ్యాంక్ తెలియజేసింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23న) ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం వరకు పడిపోయి ఒక్కో షేర్ రూ. 66.85కి చేరుకుంది. నిన్న ముగింపు ధర రూ. 83.57 కాగా, ఈ రోజు షేర్ రూ. 75.21 దగ్గర ప్రారంభమైంది. అంటే ఓపెనింగ్ నుంచే దాదాపు 10 శాతం నష్టంతో ట్రేడింగ్ స్టార్ట్ అయింది.
Read Also: The Paradise : నాని ‘ప్యారడైజ్’ ఫస్ట్ లిరికల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఈ స్కామ్ గుర్తించిన వెంటనే హర్యానా ప్రభుత్వం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను ప్రభుత్వ పనుల ప్యానెల్ లిస్ట్ నుంచి తొలగించింది. ఇకపై ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ బ్యాంకులను ఉపయోగించమని తేల్చి చెప్పింది. బ్యాంక్ రిలీజ్ చేసిన ప్రకటనలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు పేర్కొనింది. అలాగే స్వతంత్ర సంస్థ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ ఫైలింగ్ ప్రకారం, హర్యానా సర్కార్ లోని ఒక విభాగం నుంచి వచ్చిన సమాచారంతో మొదట అంతర్గత విచారణ చేపట్టగా.. ఆ సమయంలో చండీగఢ్ బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు మోసపూరితంగా వ్యవహరించినట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఉండే ఛాన్స్ ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!