Site icon NTV Telugu

Fire accident: ఊహించని అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం

Pune

Pune

మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది..

వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్‌వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతం లో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదం పై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు..

ఈ ఘటన పై పింప్రి చించ్‌వాడ్ అగ్నిమాపక దళానికి చెందిన రుషికాంత్ చిపాడే మాట్లాడుతూ, దుకాణం లోపల నిర్మించిన తాత్కాలిక అనెక్స్‌లో నివసిస్తున్న నలుగురు వ్యక్తులు మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత చనిపోయారని తెలిపారు. మృతులను చిమ్నారం బెనారం చౌదరి (48), అతని భార్య నమ్రత (40), వారి ఇద్దరు కుమారులు భావేష్ (15), సచిన్ (13) గా గుర్తించారు.. రాజస్థాన్‌లో ని పాలికి చెందిన ఈ కుటుంబం షాహునగర్‌లో సచిన్ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతోంది.. మృత దేహలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Exit mobile version