Site icon NTV Telugu

Crime: తనతో మాట్లాడటం లేదని విద్యార్థిని గొంతు కోసిన వ్యక్తి..

Madhya Pradesh

Madhya Pradesh

Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఎంబీఏ విద్యార్థిని గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి విద్యార్థిని గొంతు కోసి గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు చెప్పారు.

Read Also: Yamaha: స్పోర్ట్స్‌ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ బైక్స్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!

గాయపడిన విద్యార్థిని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని డీసీసీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. షేక్, బాధితురాలు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కొన్ని రోజులుగా ఫాలో చేస్తూ వేధిస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన రోజు నిందితుడు, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కత్తితో గొంతు కోశాడు.

షేక్ తనని గత 3 ఏళ్లుగా వేధిస్తున్నాడని, హెచ్చరించినప్పటికీ అతడు బుద్ధి మార్చుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఈ దాడి స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆగ్రహించిన హిందూ సంఘాలు శుక్రవారం సాన్వర్ బంద్‌కి పిలుపునిచ్చాయి. ప్రస్తుతం సాన్వర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.

Exit mobile version