Site icon NTV Telugu

Madhya Pradesh: మరో నిర్భయ.. గిరిజన మహిళపై దారుణం..

Madhya Pradesh Rape

Madhya Pradesh Rape

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన జరిగింది. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆమెపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది.

Read Also: High Court: అత్యాచార బాధిత, మైనర్ బాలిక ప్రసవానికి హైకోర్టు అనుమతి..

బాధిత మహిళ ఇద్దరు పిల్లల తల్లి అని పోలీసులు తెలిపారు. మహిళను ఆమె కూతురు పొరుగున ఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో గుర్తించారు. అత్యాచారం చేసిన వ్యక్తులు ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్‌ని చొప్పించి, ఆమె గర్భాశయాన్ని బయటకు తీశారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. మహిళతో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను హరి పాల్వి, సునీల్ దుర్వేగా గుర్తించారు. వీరి ఇంట్లోని బాధితురాలి మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.

Exit mobile version