Site icon NTV Telugu

Nellore Crime: కుబేర మూవీ తరహాలో భారీ స్కామ్‌.. లబోదిబోమంటున్న బాధితులు..

Nellore Crime

Nellore Crime

Nellore Crime: కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్‌తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్‌ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో తమను రక్షించాలంటూ బాధితులు.. పోలీసులను వేడుకుంటున్నారు. ఈ కేసును ముత్తుకురు పోలీసులు విచారణ చేస్తుండగా.. లోన్ చెల్లించాలని బాధితులకు నోటీసులు వస్తుండడం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. డబ్బులు రికవరీ చేయడానికి చెన్నైలోని ఓ ప్రయివేటు ఏజెన్సీతో బ్యాంకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. అయితేపోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందంటున్నారు.

Read Also: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!

యాక్సెస్ బ్యాంకు కుంభకోణంలో సూత్రదారులు దర్జాగా తిరుగుతూ ఉంటే.. బాధితులు లబోదిబో అంటున్నారు. ఆన్‌లైన్‌ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ భారీ స్కామ్ కి పాల్పడ్డారు. వ్యక్తులకూ సంబంధం లేకుండా నేరుగా.. ఆన్‌లైన్‌ ద్వారా లోన్స్ ఇవ్వొచ్చని RBI తీసుకొచ్చిన పాలసీని నిందితులు పక్కాగా ఉపయోగించుకుని స్కామ్ చేశారు. జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు మరో ఇద్దరు కలిసి ఫేక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయక ప్రజల్ని ఉద్యోగులుగా చూపించి.. వారి ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో లోన్లు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో 14 లక్షల నుంచి 50 లక్షలు దాకా రుణాలు తీసుకున్నారు.

Read Also: Astrology: ఆగస్టు 26, మంగళవారం దినఫలాలు

అయితే, పోలీసులకు ఫిర్యాదు చేశాం కదా.. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులకు బ్యాంక్ అధికారులు ఝలక్ ఇచ్చారు. EMI లు చెల్లించాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. తమకు ఏమాత్రమూ సంబంధం లేకుండా, తమవారి పేరుపై కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అటు బ్యాంకు అధికారులుకు, ఇటు పోలీసులకు తెలిసినా.. తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నెల్లూరు బ్యాంక్ అధికారులు 56 మంది జాబితాను పోలీసులకు ఇచ్చి వారు లోన్స్ కట్టడం లేదని పిర్యాదు చేశారు. విడవలూరుకు చెందిన చలంచర్ల లక్ష్మీనారాయణకు లోన్ రికవరీ ఏజెన్సీ నుంచి నోటీసులో వచ్చాయి. ఇప్పటి మూడు నోటీసులు జారీ చేశారు. యాక్సెస్ బ్యాంక్ లో రూ.14.90 లక్షలు రుణం తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో ఉండే బాధితులందరికీ ఇలాంటి నోటీసులు అందుతున్నట్లు తెలుస్తోంది. యాక్సెస్ బ్యాంక్ తన సిబ్బంది పాత్రపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు..

Exit mobile version