Tirupati: గూడూరు హత్య కేసులో మరో లేడీ డాన్ పాత్ర.. ఈమె దందా ప్రత్యేకత ఇదే!
- గూడూరు హత్య కేసులో మరో లేడీ డాన్ పాత్ర
- ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి ఫిర్యాదు
- పోలీసుల అదుపులో లేడీ డాన్‌తో సహా మరో ఇద్దరు నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా గూడూరులో బుధవారం జరిగిన హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. ఈ కేసులో మరో లేడీ డాన్ వందన పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో హంతక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్ చేతిలో కత్తులు పట్టుకుని దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో షేక్ రహీద్ (35) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం శ్మశాన వాటికలో శవమై కనిపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతనం మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఇక న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో లేడీ డాన్ వందన హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. ఈమె గంజాయి బ్యాచ్‌ను చేరదీసి వాళ్లతో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు కనిపెట్టారు. టిడ్కో గృహసముదాయాల దగ్గర వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వందన దుర్మార్గాలు గురించి ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయగా వందన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లేడీ డాన్ వందనతో పాటు మరో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వందన గురించి తప్పుగా మాట్లాడడంతోనే రహీద్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్యపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!