జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం సమీపంలోని రిజర్వాయర్ దగ్గరలో ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించడంతో .. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విద్యార్థులు.
పూర్తి వివరాల్లోకి వెళితే… సీనియర్లు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో బాలుర హాస్టల్‌లోని బాల్కనీ నుంచి పడి మొదటి సంవత్సరం బెంగాలీ ఆనర్స్ విద్యార్థి మరణించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అనేక మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని రిజర్వాయర్ సమీపంలో మూడవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించిందని విశ్వవిద్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆమె అక్కడ తన క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతోందని మరో విశ్వవిద్యాలయ అధికారి తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. గురువారం సాయంత్రం క్యాంపస్‌లోని రిజర్వాయర్ సమీపంలో ఇంగ్లీష్‌లో మూడవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించిందని విశ్వవిద్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆమె అక్కడ తన క్లాస్ మేట్స్ తో మాట్లాడుతోందని మరో విశ్వవిద్యాలయ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు కారణం ఇంకా తెలియ రాలేదు.
విద్యార్థినిని ఆమె స్నేహితులు ఇతర విశ్వవిద్యాలయ సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ అక్కడికి చేరుకునేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థి పేరును వెల్లడించలేదు. వర్సిటీ సీనియర్ అధికారులు, అధ్యాపకులు ఆర్ట్స్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు డెడ్ బాడీని పోస్టు మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.