Site icon NTV Telugu

Tirupati Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి మోసం..!

Instagram

Instagram

Tirupati Crime: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఏది రియల్‌.. ఏది వైరల్‌.. ఎవరు మంచి..? ఎవరు మోసం చేసేవాడు అని తెలుసుకునే లోపు జరగాల్సింది అంతా జరిగిపోతోంది.. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రేమలో పడి.. మోసపోయినవారి జాబితా చాలా పెద్దదే.. తాజాగా తిరుపతిలో మరో మైనర్‌ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..

Read Also: Hyderabad: అక్రమ పటాకుల నిల్వలే హైదరాబాద్‌లో ప్రమాదాలకు కారణం: జిల్లా ఫైర్ అధికారి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌ బాలికకు పరిచయం అయ్యాడు ఓ యువకుడు.. అతడి మాటల మైకంలో పడిపోయింది ఆ బాలిక.. ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఆ యువకుడు.. తన కామవాంఛను తీర్చుకున్నాడు.. పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో.. చివరకు గర్భం దాల్చింది.. ఆ తర్వాత ఆ యువకుడు మొహం చాటేసినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. నెలలు నిండక ముందే కాన్పు కావడంతో.. బిడ్డ మృతిచెందాడు.. బాలిక పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఆ బాలిక.. ఇక, ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు..

Exit mobile version