Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమగా మారిన పరిచయం..
- పక్కా పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఒక హత్య సంచలనం సృష్టించింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ, తన భర్తను దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బార్మర్ జిల్లాలోని మాల్పురా ఫాంటా సమీపంలోని ఓ పొలంలో ఉన్న నీటి ట్యాంకులో 42 ఏళ్ల తేజారామ్ మృతదేహం కనిపించింది. ఇది జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి సోదరుడు మహేశ్వరం ఫిర్యాదు మేరకు, తేజారామ్ భార్య నేతల్, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్‌లపై అనుమానం వ్యక్తం చేశారు. గుమాన్ సింగ్ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతడికి నేతల్తో వివాహేతర సంబంధం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేతల్కు ఇన్‌స్టాగ్రామ్‌లో 42 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇన్‌స్టా ద్వారా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీని గురించి తెలిసిన తేజారామ్, భార్యను పలుమార్లు మందలించాడు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఈ నేపథ్యంలోనే భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేశారు. జూన్ 2న నేతల్ తన భర్తకు ఫోన్ చేసి, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆందోళన చెందిన తేజారామ్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో గుమాన్ సింగ్ అతడిని ధోరిమన్నాకు రమ్మని పిలిచి, అక్కడే తేజారామ్‌కు మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత, మాల్పురా ఫాంటా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి హత్య చేశాడు. మత్తులో ఉన్న తేజారామ్ నీటిలో మునిగి మరణించాడు.
హత్య తర్వాత తేజారామ్ మొబైల్ ఫోన్, బ్యాగ్ అక్కడే పడేసి ఇద్దరూ పరారయ్యారు. మృతుడి మొబైల్, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. భార్య నేతల్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, గుమాన్ సింగ్ ను పోలీస్ కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!