హైదరాబాద్ లోని బండ్లగూడలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి యువకుడిని కత్తులతో దాడి చేసి హతమార్చారు దుండగులు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.
Read Also: Offers Liquor to Tiger: ఎవడండి బాబు వీడు.. పెద్ద పులికే మందు తాగించుబోయాడు
నగరంలోని ఘౌస్‌నగర్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్(35)పై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాల సేకరణ కొనసాగుతోంది. ప్రస్తుతం మొహ్సిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read Also:Bigg Boss 9 : దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీనివాస్ వార్నింగ్.. మొత్తం తెలుసంటూ..
దాడి వెనుక గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. వ్యక్తిగత విభేదాలు, వ్యాపార వివాదం లేదా పాత విరోధమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజీలను పరిశీలించి నిందితుల ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో ఘౌస్‌నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో భయానకు వాతావరణం ఏర్పడింది.