Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా దోచేశాడు.. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.. చోరీ చేసిన సొమ్ముతో షాపింగ్‌లు, జల్సాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు..!! ఏం చోరీ చేశాడో తెలుసుకుందాం.. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో పట్టపగలే ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనాన్ని అందులో పని చేస్తున్న డ్రైవరే ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ కేసు ఒక్కసారిగా సిటీలో సంచలనంగా మారింది. ఏటీఎంలలో నగదు నింపేందుకు తీసుకెళ్తున్న క్యాష్ వ్యాన్‌లో దాదాపు రూ.60 లక్షల నగదు ఉన్నట్లుగా మేనేజ్‌మెంట్ చెబుతోంది.. ఏటీఎం చోరీ కేసులో నగదును ఎత్తుకెళ్లిన డ్రైవర్ అజీత్ అలియాస్ శివ గత 10 రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు..
Also Read
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
- Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
నగదు రవాణా చేసే CMS కంపెనీలో డ్రైవర్‌గా ఆరు నెలల క్రితం అజీత్ ఉద్యోగంలో చేరాడు. గోపన్‌పల్లి పరిధిలోని ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు కోటి రూపాయలకుపైగా నగదుతో డ్రైవర్ అజీత్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది క్యాష్ వ్యాన్‌లో బయలుదేరారు. గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి సెక్యూరిటీ సిబ్బంది, క్యాషియర్‌లు మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో డ్రైవర్ అజీత్ ఒంటరిగా వాహనం దగ్గరకు వచ్చి క్యాష్‌తో ఉన్న వ్యాన్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే CMS సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. దొంగిలించిన వాహనాన్ని అజీత్ తెల్లాపూర్ సమీపంలో వదిలి, నగదు ఉన్న ట్రంకు పెట్టతో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు నేరుగా ముంబైకి వెళ్లి కొన్ని రోజులు షాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.
READ MORE: Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
ఆ తర్వాత బెంగళూరుకు చేరుకుని అక్కడి మాల్స్‌లో కూడా కొనుగోళ్లు చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటివరకు వందకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. అజీత్‌ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ముందుగానే పథకం వేసుకుని CMS కంపెనీలో ఉద్యోగంలో చేరి ఈ దోపిడీకి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడికి మరెవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
-
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
-
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
-
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్‌కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!