Site icon NTV Telugu

AP Crime: భార్య గురించి తప్పుగా మాట్లాడిన స్నేహితుడు.. కత్తితో దాడి చేసిన భర్త..

Crime

Crime

AP Crime: తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో భర్త.. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో.. చికెన్‌ కొట్టే కత్తితో స్నేహితుడి మెడపై దాడి చేయడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది.. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం సృష్టించింది..

Read Also: Venky Atluri : సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..

కోనసీమ జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం వానపల్లి మర్రివారిపేటలో దారుణం జరిగింది.. భార్య గురించి తప్పుగా మాట్లాడినందుకు పితాని సతీష్ పై అనే వ్యక్తిపై భర్త మానుపాటి రమేష్‌ కత్తి దాడి చేశారు.. మెడపై బలంగా కత్తి దిగటంతో సతీష్ పరిస్థితి విషమం ఉంది. మొదట కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Read Also: Kalyandurg E-Stamp Scam: ఈ-స్టాంపుల స్కామ్‌ను ఛేదించిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్..

అయితే, కొత్తపేట మండలం మోడెకూరు మానుకొండ రమేష్‌ .. మాలకొండయ్య నగర్ శివారులో చికెన్ షాప్ నడుపుకుంటున్నాడు.. ఇతని భార్య సుజాత మూడు రోజుల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.. ఇదే గ్రామానికి చెందిన పితాని వెంకట సతీష్ మరియు రమేష్ ఇరువురు స్నేహితులు.. ఇద్దరూ మందు తాగి మోటారుసైకిల్ పై చికెన్ షాప్ వద్ద ఆగారు.. ఆ సమయంలో వెంకట సతీష్.. రమేష్ భార్య గురించి అసభ్య పదజాలంతో మాట్లాడాడు.. కోపంతో ఊగిపోయిన రమేష్‌.. చికెన్ కొట్టే కత్తితో మోటారు సైకిల్ పై కూర్చుని ఉన్న సతీష్ మెడపై నరకడంతో బలమైన గాయం అయ్యింది.. వెంటనే అతనిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లగా.. మెరుగైన చికిత్స కొరకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు..

Exit mobile version