Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నంబర్ 1 లోని తెలంగాణ స్పైసి కిచెన్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలుడు ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరగడంతో బస్తీ వాసులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు దాటికి హోటల్ పక్కన ఉన్న బస్తీ లోని ఇల్లు ధ్వంసమయ్యాయి. పేలుడు సంభవించడంతో బస్తీవాసులు ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. పేలుడు సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్స్ హోటల్ కి చేరుకున్నారు. పేలుడు కు గల కారణాల పై క్లూస్ సేకరిస్తున్నారు. హోటల్ లోని రిఫ్రిజిరేటర్ లో ఉన్న కంప్రెసర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. హోటల్ వెనక వైపు రాతి కట్టడం ఉండటంతో… పక్కనే ఉన్న దుర్గా భవాని నగర్ బస్తీ లోకి రాళ్ళు ఎగిరిపడ్డాయి. సిమెంట్ రేకులు, ఇనుప రేకుల కప్పులు ఉన్న ఇళ్లపై రాళ్ళు ఒక్కసారిగా పడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ తలకు గాయం కాగా.. మరో బాలిక కు స్వల్ప గాయాలతో బయట పడింది. రాళ్ళు, స్థంబాలు పడటంతో 6 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరగిందని బస్తీవాసులు వాపోయారు.
మరోవైపు ఘటనా స్థలానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శించారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ అన్వేషిస్తున్నాయన్నారు. సిలిండర్ బ్లాస్ట్ అయితే కాదనిపిస్తోంది.. మంటలు చెలరేగలేదని అన్నారు. 6 ఇళ్ళు ధ్వంసం అయ్యాయని తెలిసింది.. వాళ్లకు తిరిగి ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?