Horror in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువన్నమలై ( అరుణాచలం) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంథాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసినా ఇద్దరు కానిస్టేబుల్స్.. అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కోట్టి కిందకు దింపారు.
Read Also: H-1B visa: H-1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు.. ఫిబ్రవరి నాటికి కొత్త వ్యవస్థ..
ఇక, యువతి లక్ష్మీనీ పక్కనే ఉన్న పొలంలోకీ బలవంతంగా లాక్కెళ్ళి ఇద్దరు కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ అత్యాచారం చేశారు. ఇది గమనించిన బాధితురాలు లక్ష్మీని రక్షించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారణ చేశారు. ఇక, ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు.