Site icon NTV Telugu

Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..

Crime

Crime

Hijra Suicide: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక ఘటన జరిగింది.. పార్వతీపురం మన్యం జిల్లాలో వరుసకు మనవడు అయ్యే ఎనిమిదేళ్ల బాలుడి మృతిని జీర్ణించుకోలేక ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకుంది.. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడి మరణం జీర్ణించుకోలేక వరసకు చిన్న తాత అయిన బాపన్న అనే హిజ్రా.. పత్తి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.

Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..

అయితే, బాపన్న హిజ్రా కావడంతో తన అన్న కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించేవాడట.. అన్న పిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ వారందరిని కంటికి రెప్పలా చూసుకునేవాడు బాపన్న. ఇక, మనవడు పృథ్వీ అంటే బాపన్నకు ఎంతో ఇష్టమట.. కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మనవడు పృథ్వీ.. గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కీడవాయి గ్రామంలో తన ఇంటిలో ప్రాణాలు విడిచాడు.. ఆ ఘటనను జీర్ణించుకోలేక పోయిన బాపన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. తాత మనవళ్ల మృతితో కీడవాయి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన నీలకంఠపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version