Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..
- పార్వతీపురం మన్యం జిల్లాలో 8 ఏళ్ల బాలుడు మృతి..
- మనవడి మరణం జీర్ణించుకోలేక చిన్న తాత బాపన్న (హిజ్రా )ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hijra Suicide: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక ఘటన జరిగింది.. పార్వతీపురం మన్యం జిల్లాలో వరుసకు మనవడు అయ్యే ఎనిమిదేళ్ల బాలుడి మృతిని జీర్ణించుకోలేక ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకుంది.. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవడి మరణం జీర్ణించుకోలేక వరసకు చిన్న తాత అయిన బాపన్న అనే హిజ్రా.. పత్తి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.
Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఆగ్రహం.. దౌత్యపరంగా నిరసన..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అయితే, బాపన్న హిజ్రా కావడంతో తన అన్న కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించేవాడట.. అన్న పిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ వారందరిని కంటికి రెప్పలా చూసుకునేవాడు బాపన్న. ఇక, మనవడు పృథ్వీ అంటే బాపన్నకు ఎంతో ఇష్టమట.. కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మనవడు పృథ్వీ.. గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కీడవాయి గ్రామంలో తన ఇంటిలో ప్రాణాలు విడిచాడు.. ఆ ఘటనను జీర్ణించుకోలేక పోయిన బాపన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. తాత మనవళ్ల మృతితో కీడవాయి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన నీలకంఠపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!