Site icon NTV Telugu

గేమ్‌ ఆడుతుంటే వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేశాడు.. ఆ తరువాత..

నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజు పదుల సంఖ్యలో వివిధ సంస్థలకు సంస్థలకు సంబంధించిన వైబ్‌సైట్‌ లింకులు మన ఫోన్లకు వస్తుంటాయి. అయితే వాటిలో ఏది కంపెనీతో ఏదీ సైబర్‌ నేరగాళ్ల తెలియక ఎంతో మంది మోసపోతున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నవయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో సహజీవనం చేస్తున్నారు చిన్నారులు. ఉదయ నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు చాలా సమయం ఫోన్‌లో గేమ్‌లు ఆడటానికి, వీడియోలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఏవైనా లింక్‌ను వస్తే వాటిపై అవగాహన లేకుండా ఓపెన్‌ చేస్తూ ఇక్కట్లలో పడుతున్నారు.

ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. రైటర్ట్‌ ఎస్సై అస్గర్‌ అలీ తన కుమారు ఫోన్‌లో గేమ్‌లు ఆడుకుంటానంటే మొబైల్ ఇచ్చాడు. దీంతో సదరు బాలుడు గేమ్‌లు ఆడుతున్నప్పుడు యాడ్స్‌ లింక్‌ రావడంతో ఓపెన్‌ చేశారు. ఇంకేముంది ఏకంగా అస్గర్‌ అలీ ఖాతాలో ఉన్న రూ. 11 లక్షలు స్వాహా చేశారు సైబర్‌ నేరగాళ్లు. వెంటనే తేరుకున్న అస్గర్‌ అలీ వెంటనే సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వెంటనే స్పందించిన సైబర్‌ క్రైం పోలీసులు నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి రూ.11 లక్షలు రికవరీ చేశారు.

Exit mobile version