Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
- అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నేహితులు
- సీసీటీవీతో ఛేదించిన హయత్‌నగర్ పోలీసులు
- డబ్బుల వివాదమే హత్యకు కారణమా?
- నిందితులకు కఠిన శిక్ష విధించాలని కుటుంబం డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన యువకుడు సుహాస్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తోటి స్నేహితులే అతడిని దారుణంగా హత్య చేసి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచ్‌పై పడుకోబెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, సిసిటివి (CCTV) ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సుహాస్ తల్లి ,స్నేహితురాలు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో రాకేష్ గౌడ్, పరశురామ్, రాజు అనే స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోన్ చేశారని, కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏకంగా ఇంటికే వచ్చి ఐదు నిమిషాల్లో పంపుతామని నమ్మించి బండిపై తీసుకెళ్లారని కన్నీరుమున్నీరయ్యారు. వెళ్లొద్దని ఎంత బ్రతిమిలాడినా వినకుండా తీసుకెళ్లి, మరుసటి రోజు ఉదయానికి శవంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ విద్యార్థిని హత్య..?
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Wife Murder: స్మూతీలో విషం? అమెరికాలో భార్యను కడతేర్చిన తెలంగాణ భర్త కేసులో సంచలన విషయాలు!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
రాకేష్ గౌడ్‌కు చెందిన డబ్బుల వ్యవహారంలో వచ్చిన గొడవలే ఈ దారుణ హత్యకు కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన డబ్బును సుహాస్ తీసుకున్నాడనే అనుమానంతోనే రాకేష్ తన అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, నమ్మి వెళ్లిన స్నేహితుడిని ఇంత దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని సుహాస్ తల్లి డిమాండ్ చేశారు. నిందితులు సుహాస్‌ను కొట్టి చంపిన అనంతరం మృతదేహాన్ని పసుమాముల వద్ద సిమెంట్ బెంచ్‌పై పడుకోబెట్టి పారిపోయినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!