NTV Telugu Site icon

Guntur Crime: లేడీ కిల్లర్స్.. అప్పు తీసుకుంటారు.. అడిగితే కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌ కలిపి చంపేస్తారు..!

Guntur Crime

Guntur Crime

Guntur Crime: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్‌ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు.. గతంలో డబ్బులు సంపాదించేందుకు కాంబోడియా వెళ్లి, సైబర్ నేరాల్లో పాల్గొన్న వెంకటేశ్వరి అనే మహిళ.. ఇండియా వచ్చిన తర్వాత.. అప్పు తీసుకొని, డబ్బులు అడిగితే కూల్ డ్రింక్ లో సైనైడ్‌ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.. తెనాలి మండలం కటివరం ప్రాంతానికి చెందిన నాగూర్ బీని మరో ఇద్దరు మహిళల సహకారంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు..

Read Also: Ganesh Chaturthi: గణేశ్‌ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమయ్యాయి?.. హైదరాబాద్‌ కి ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?

ఇక, గతంలోనూ వెంకటేశ్వరి పలు హత్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.. ఈ కేసులో మునగప్ప రజని , ముడియాల వెంకటేశ్వరి, గొంతు రమణమ్మ అనే ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. మొత్తంగా గుంటూరు జిల్లాలో సైనైడ్‌ కిల్లర్స్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. రెండేళ్లలో నాలుగు హత్యలు, మూడు హత్యాయత్నాలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. నాలుగు హత్యలను ఒకే తరహాలు చేసిందట ఈ గ్యాంగ్.. ఆహార పదార్థాల్లో లేదా కూల్‌ డ్రింక్‌లో సైనైడ్‌ కలిపి మర్డర్స్‌ చేయడం వారి స్పెషాలిటీ అంటున్నారు.. ఈ ఏడాది జూన్‌లో జరిగిన హత్యకేసును ఛేదించే క్రమంలో మిగతా మూడు హత్యలు వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌ తిన్నారు..