Guntur Drugs: గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్. గుంటూరుకు చెందిన ఖాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చాడు. ఇదే సమయంలో డ్రగ్స్ సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు.. పక్కా పథకం ప్రకారం దాడిచేసి విశాల్ సింగ్ చౌహాన్ తోపాటు ఖాజా వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. వారినుంచి 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామంటున్నారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్ కోసం గాలింపులు చేపట్టామంటున్నారు.
Read Also: Smriti Mandhana: పలాష్ ముచ్చల్ మామూలోడు కాదుగా.. సినిమాటిక్ స్టైల్ లో లవ్ ప్రపోజల్..!
కాగా, పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మళ్లీ డ్రగ్స్, గంజాయి పట్టుపడుతూనే ఉంది.. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో.. కొన్నిసార్లు తక్కువ మొత్తంలో అయినా.. వరుసగా ఎక్కడో ఒక చోట డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి.. ఇలా పేరు ఏదైనా.. మత్తు పదార్థాలతో పట్టుపడుతూనే ఉన్నారు.. కాగా, డ్రగ్స్, గంజాయి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే..