Tragedy : గోవాలో మరోసారి పర్యాటకుల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదుకు చెందిన ఓ దంపతులు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లగా, పనాజీ బస్‌స్టాండ్ సమీపంలో బైక్ అద్దె వివాదం ఘర్షణకు దారితీసింది. సెలవులు రావడంతో గోవా పర్యటనకు వెళ్లిన ఈ జంట, స్థానికంగా బైక్ అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం సమయానికి తిరిగి అప్పగించినప్పటికీ, అద్దెదారులు అదనంగా ₹200 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించగా, మాటల తూటాలు ఘర్షణకు మారాయి.
CM Chandrababu: పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది..
వాగ్వాదం పెరగడంతో కొంతమంది బైక్ అద్దెదారులు గుంపుగా వచ్చి జంటపై దాడి చేశారు. ఈ ఘటనలో భర్త తలకు గాయాలు కాగా, గర్భిణి భార్య ముఖం తీవ్రంగా ఉబ్బిపోయింది. వెంటనే వారిని గోవా మెడికల్ కాలేజ్‌కు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల కుటుంబసభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా గోవాలో పర్యాటకులపై దాడులు జరిగి ప్రాణనష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో గోవాకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బైక్ అద్దె లేదా ఇతర లావాదేవీలలో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని, వివాదాలు తలెత్తినపుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Death Note web series: వెబ్ సిరీస్ ప్రభావం.. నేను వెళ్లే సమయం ఆసన్నమైంది.. అంటూ?