Tragedy : గోవాలో మరోసారి పర్యాటకుల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదుకు చెందిన ఓ దంపతులు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లగా, పనాజీ బస్‌స్టాండ్ సమీపంలో బైక్ అద్దె వివాదం ఘర్షణకు దారితీసింది. సెలవులు రావడంతో గోవా పర్యటనకు వెళ్లిన ఈ జంట, స్థానికంగా బైక్ అద్దెకు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం సమయానికి తిరిగి అప్పగించినప్పటికీ, అద్దెదారులు అదనంగా ₹200 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించగా, మాటల తూటాలు ఘర్షణకు…