Site icon NTV Telugu

Breaking News : మారని మృగాళ్లు.. 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌..

Physically Harassed

Physically Harassed

మొన్నటికి మొన్న అమ్నిషియా పబ్‌ రేప్‌ కేసు ఘటన మరువక ముందే మరో ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. వివరాలిలా.. పాతబస్తీకి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన 14 ఏండ్ల బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవ పడి బయటకు వచ్చింది. 2 కిలోమీటర్ల దూరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటోలోని నలుగురు యువకులు ఒంటరిగా ఉన్న ఆ బాలికతో మాటలు కలిపారు. బండ్లగూడ నుండి ఆరాంఘర్.. మోహదీపట్నం.. తీపుతూ అనంతరం కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డారు.

మరునాడు ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను భరోసా సెంటర్ కు తరలించారు. అయితే.. సామూహిక అత్యాచారినికి పాల్పడిన నలుగరు నిందితులు పహాడీషరీఫ్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను కోర్టులో హజరుపరిచిన్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version