NTV Telugu Site icon

UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం

Up

Up

ఉత్తరప్రదేశ్‌లో కొత్త తరహా దోపిడీ వ్యవహారం బయటపడింది. నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

ఇటీవల రాజు అనే యువకుడు ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. 30 ఏళ్ల క్రితం తాను కిడ్నాప్‌కు గురైనట్లు.. సోదరితో స్కూల్‌కి వెళ్తుండగా అగంతకులు ఎత్తుకెళ్లిపోయారని స్టోరీ చెప్పాడు. నిజమే అనుకుని పోలీసులు ఆశ్రయించి.. ప్రకటనలు ఇచ్చారు. ఓ వ్యక్తి.. తప్పిపోయిన మేనల్లుడే అనుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు కూడా ముచ్చటపడ్డారు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో పరిస్థితులు అన్ని కుదిటపడ్డాక.. అతగాడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరా తీయడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో కుటుంబ సభ్యులతో సరిపోలేదు. దీంతో తమదైన శైలిలో విచారిస్తే.. రాజు నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడా పిల్లలు తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో.. ఎంక్వైరీ చేసి వారి ఇంట్లోకి ప్రవేశించి ఆస్తులు వివరాలు తెలుసుకుని దోపిడీ చేస్తున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన రాజుగా గుర్తించారు. అతడు దొంగతనాలకు అలవాటుపడటంతో విసుగు చెందిన కుటుంబసభ్యులు 2005లో బయటకు గెంటేశారని తెలిపారు. అప్పటినుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరిస్తూ.. పేరు మార్చుకొని తానే వారి కుమారుడినని నమ్మించి.. వారి ఇంట్లో తిష్ఠ వేసే వాడనని చెప్పారు. కొన్ని రోజుల అనంతరం ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకొని ఎవరికీ చెప్పకుండా ఉడాయించేవాడని తెలిపారు. అలా ఇప్పటివరకు పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానాలోని హిసార్‌, సిర్సాలోని తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: INDIA Alliance: ఇక ఇండియా కూటమి సంగతి అంతేనా.. కాంగ్రెస్‌కి ‘హ్యాండ్’ ఇస్తున్న మిత్రులు..