Smuggling :సంగారెడ్డి జిల్లా పోలీసులు సినిమా తరహాలో జరుగుతున్న గంజాయి రవాణా ముఠాను బహిర్గతం చేశారు. ప్రముఖ సినిమా *‘పుష్ప’*లో చూపించిన విధంగానే ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారులో గంజాయి తరలింపులు జరుగుతున్న విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు చిరంజీవి అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు భారీగా ఎండు గంజాయిని రవాణా చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. సాధారణంగా ఎవరూ అనుమానం రాకుండా ఉండేందుకు అతను తన కారును ప్రత్యేకంగా మోడిఫై చేయించాడు. డ్యాష్ బోర్డు లోపల, సీట్ల కింద రహస్యంగా ప్రత్యేక క్యాబిన్లను తయారు చేయించి అందులో గంజాయి దాచిపెట్టాడు. ఈ పద్ధతి చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. తాజా పరిణామాలపై చంద్రబాబు ఏం చేస్తారు..?
కారులో మొత్తం 5.4 కేజీల ఎండు గంజాయి దొరికింది. అదేవిధంగా కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్, సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులు ఉమ్మడిగా తనిఖీలు జరిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి దందాలలో ఎవరూ తలదూర్చవద్దని పోలీసులు హెచ్చరించారు.మొత్తానికి “పుష్ప” సినిమాలోలాగే రియల్ లైఫ్‌లో కూడా గంజాయి రవాణా జరుగుతుందన్న వాస్తవం మరోసారి వెలుగులోకి వచ్చింది. కానీ పోలీసుల అప్రమత్తతతో ఈసారి ఆ రవాణా విఫలమైంది.
Pan-India Movie : అప్పట్లోనే పాన్-ఇండియా ఆఫర్‌ను తిరస్కరించిన NTR..