NTV Telugu Site icon

Vizag Crime: విశాఖలో దారుణం.. లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి..!

Girl Rape

Girl Rape

Vizag Crime: ఆడ పిల్ల కనిపించిందంటే చాలు.. కామంతో కళ్లుమూసుకుపోయి కామంధులు రెచ్చిపోతున్నారు.. ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు.. బాలికలు, అమ్మాయిలు, మహిళలు.. వృద్ధులు.. ఇలా తిరిగి సురక్షితంగా ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యుల్లో టెన్షన్‌ ఉంటుంది.. దేశవ్యాప్తంగా పలు అత్యాచారా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది..

Read Also: Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..

న్యాయం అందకుండా అన్యాయానికి గురవుతున్న ఎంతో మందికి న్యాయసాయం చేయాలన్న ఉద్దేశంతో లా చదువుతోన్న ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు యువకులు.. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.. బాధితురాలని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని NVP లా కాలేజీలో లా థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది.. ఆమె సహచరి విద్యార్థి అయిన వంశీతో స్నేహం చేసింది.. అయితే, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ.. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు.. అక్కడే విద్యార్థిని ఎంత వారించినా వినకుండా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..

Read Also: Stock Market : వారం తర్వాత ఊపందుకున్న స్టాక్ మార్కెట్.. 75నిమిషాల్లో రూ.6.55లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు

ఇక, మళ్లీ అదే నెల 13వ తేదీన డాబాగార్డెన్ లో ఉంటున్న తన ఫ్రెండ్‌ ఆనంద్‌ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌ కూడా అక్కడికి వచ్చి ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇక, ఆ దృశ్యాలు తమ ఫోన్లలో చిత్రీకరించి.. బెదిరిస్తూ.. మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడి.. తమ పశువాంఛ తీర్చుకున్నారు.. అయితే, 2 నెలల తర్వాత మళ్లీ ఆనంద్‌, రాజేష్‌, జగదీష్‌.. బాధితురాలికి ఫోన్‌ చేసి.. తమ వద్దకు రావాలని కోరిన తీర్చాలని బెదిరించారు.. లేకపోతే పాత వీడియోలు బయటపెడతామంటూ భయపెట్టారు.. దీంతో, ఈ విషయం వంశీకి దృష్టికి తీసుకెళ్లింది బాధితురాలు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వంశీ కూడా వారి కోరిక తీర్చాలంటూ మానసికంగా వేధించసాగాడు.. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఈ నెల 18వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది బాధితురాలు.. ఇది గమనించిన బాధితురాలి తండ్రి అడ్డుకుని.. ఏం జరిగిందని నిలదీయడంతో.. అసలు విషయం బయటపెట్టింది.. దీంతో.. విశాఖ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు..

Show comments