Devil Daughters : ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రిని హత్య చేసిన కూతుళ్లు.. కలకలం రేపుతున్న వరంగల్ ఘటన
- ప్రేమను అడ్డుకున్న తండ్రిపై కూతుళ్ల తాపత్రయం
- కన్న తండ్రిని హత్య చేసిన కూతుళ్లు, సహకరించిన తల్లి
- కాలేజీ ప్రేమ వ్యవహారం.. ఇంటిని చేజార్చిన ఘోర నేరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి అంటే చెట్టంత బలం. అలాంటి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇద్దరు కూతుళ్లు.. కర్కశంగా ప్రవర్తించారు. ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నారు. కంటే కూతుర్నే కనాలి.. కంటే కూతుర్నే కనాలి అంటారు.. తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుంటుంది. అంటే.. కూతురు అయితే తల్లిదండ్రులను కడవరకు కనిపెట్టుకుని ఉంటుందని దీని అర్ధం.. భిన్నంగా కొంత మంది కూతుళ్ల ప్రవర్తన.. కానీ కాలం మారింది. కలికాలం దాపురించింది. ఎందుకంటే కొంత మంది కూతుళ్లు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు..కన్న తండ్రికి కాలయముళ్లుగా మారి ఇద్దరు కూతుళ్లు
ప్రేమకు అడ్డు చెప్పడమే ఆయన చేసిన నేరం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు కూతుళ్లు.. కన్న తండ్రికి కాలయముళ్లుగా మారారు. ప్రేమకు అడ్డు చెప్పడమే ఆయన చేసిన నేరం. అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు ఇద్దరు కూతుళ్లు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కూతుళ్లకు కన్న తల్లి కూడా సహకరించింది..చిన్నకూతురుకు సురేష్ అనే వ్యక్తితో పరిచయం తరుచూ ఫోన్ మాట్లాడుతున్న పల్లవికి తండ్రి మందలింపు.. ప్రేమను ఒప్పుకోని తండ్రిని చంపేందుకు పల్లవి స్కెచ్. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ధారావత్ కిషన్. మరిపెడ మండలం జెండాల తండాలో భార్య, ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. మంచి చదువు చెప్పించాడు. కాలేజీకి పంపించిన చిన్నకూతురుకు.. సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇంట్లో ఉండి తరచూ ఫోన్ మాట్లాడుతుండేది. ఇది ఓ రోజు కిషన్ కంట పడింది.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
తరుచూ ఫోన్ మాట్లాడుతున్న పల్లవిని మందలించాడు తండ్రి కిషన్. కానీ అతన్నే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేసింది. దీనికి ఒప్పుకోని కిషన్.. కాస్తంత గట్టిగానే బదులు చెప్పాడు. ఐతే తన ప్రేమను ఒప్పుకోవట్లేదని ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు పల్లవి స్కెచ్ వేసింది..పల్లవికి సహకరించిన కిషన్ భార్య కావ్య, పెద్దకూతురు రమ్య .. పల్లవికి.. కిషన్ భార్య కావ్య, పెద్దకూతురు రమ్య కూడా సహకరించారు. పక్కటెముకలు విరగొట్టి, పిడుగుద్దులతో కిషన్ పైకి దాడి దిగారు ఇద్దరు కూతుళ్లు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. కిషన్ బంధువుల ఫిర్యాదుతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు..పరారీలో చిన్న కూతురు, ప్రియుడు సురేష్. ప్రస్తుతం పోలీసుల అదుపులో కిషన్ భార్య కావ్య, కూతుళ్లు రమ్య, పల్లవి ఉన్నారు. చిన్న కూతురు ప్రియుడు సురేష్, అతని బంధువులు పరారీలో ఉండగా పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న తండ్రినే చంపిన కూతుళ్ల విషయంపై స్థానికులు.. కలికాలం అని చర్చించుకుంటున్నారు…
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!