Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో కిట్టు పవన్‌పై ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ క్లాప్ కొట్టగా, ప్రముఖ సంగీత దర్శకుడు, డైరెక్టర్ ఆర్.పి. పట్నాయక్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. నేషనల్ అవార్డ్ విన్నర్, దర్శకుడు సతీష్ వేగేశ్న, ఫోక్ సింగర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ కలిసి దర్శకుడు దిలీప్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబోస్.. ఈ చిత్ర బృందంలోని ప్రతిభ తనకు బాగా తెలుసని, తనకు ఎంతో ఆత్మీయులైన నిర్మాతలు, సంగీత దర్శకుడు మదిన్కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. మంచి కథతో వస్తున్న దర్శకుడు దిలీప్‌కు నిర్మాతలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ సూపర్ హిట్ కావాలని సతీష్ వేగేశ్న అన్నారు. ఆర్.పి. పట్నాయక్ స్పందిస్తూ.. ఈ నిర్మాతలు భవిష్యత్తులో పదుల సంఖ్యలో సినిమాలు తీసి పెద్ద స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తనను ప్రోత్సహించడానికి సినీ పెద్దలు రావడం పట్ల హీరో కిట్టు పవన్ భావోద్వేగానికి గురయ్యారు. ఒక సాధారణ జానపద కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన తనకు, తొలి సినిమాకే ఇంతటి ఉద్ధండులు వచ్చి ఆశీర్వదించడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, సినిమాటోగ్రాఫర్ జనతా బబ్లూ, నూతన దర్శకుడు కృష్ణకాంత్‌తో పాటు పలువురు జానపద కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Also Read
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?