MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- పూణేలో మటన్ వండే విషయంలో కుటుంబ వివాదం విషాదం.
- శ్రావణ మాసంలో మటన్ వండాలని పట్టుబట్టిన కొడుకు.
- మాంసాహారం వండేందుకు తల్లిదండ్రులు నిరాకరణ.
- తండ్రి దాడి చేయడంతో కొడుకు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MAHARASHTRA: ‘‘మటన్’’ వివాదం సొంత కొడుకు హత్యకు కారణమైంది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శ్రావణ మాసంలో మటన్ వండటం విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాలను తీసింది. వార్జే-మల్వాడి ప్రాంతంలో 30 ఏళ్ల మహేష్ భగవాన్ గైక్వాడ్‌ను తండ్రి కొట్టి చంపారు. పోలీసులు నిందితుడైన 64 ఏళ్ల తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్‌ను, అతని 60 ఏళ్ల తల్లి పార్వతి భగవాన్ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు.
ఆగస్టు 25న రాత్రి ఈ హత్య జరిగింది. పోలీసులు విచారణ ప్రకారం.. మృతుడు మహేష్‌కు పెళ్లై 10 ఏళ్లు యింది. అయితే, తాగుబోతు కావడం, ఉద్యోగం లేకపోవడంతో అతడి భార్య, ఇద్దరు పిల్లలు మహేష్‌ను విడిచి వెళ్లారు. ఇటీవలే వారీకి విడాకులు మంజూరైనట్లు తేలింది. ఒంటరిగా జీవిస్తున్న మహేష్, తరుచుగా భోజనం చేయడానికి దగ్గర్లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేవాడు. ఆగస్టు 25వ తేదీ రాత్రి మద్యం మత్తులో తల్లిదండ్రుల ఇంటికి వచ్చినట్లు సమాచారం.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇంటికి వచ్చిన మహేష్ తనకు మటన్ కూర కావాలని, వండాలని కోరాడు. అయితే, శ్రావణ మాసం కావడంతో మాంసాహారం వద్దని వారు చెప్పారు. దీంతో మహేష్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. వివాదం పెద్దది కావడంతో మహేష్ తండ్రి భగవాన్ సూర్యభాన్ గైక్వాడ్ అతడి ముఖం, తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహేష్ పరిస్థితి విషమించి మరణించాడు. దాడి తర్వాత సాక్ష్యాలు నాశనం చేయడానికి రక్తపు మరకల్ని ఇద్దరూ తుడిచేశారు. ఈ కేసులో తండ్రిని, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినందుకు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!