Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Fake Call Centers In India Target Us Citizens Ed Conducts Nationwide Raids

Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు!

Published Date :February 10, 2026 , 10:03 pm
By Kothuru Ram Kumar
Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fake Call Center: అమెరికా పౌరులే వారి టార్గెట్.. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తారు.. వారిని నిలువునా వణికిస్తారు.. వారిని భయపెట్టి డాలర్లలో డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకోసం ఏకంగా ఇండియాలో ఫేక్ కాల్స్ సెంటర్స్ ఓపెన్ చేశారు. మాంచి ఇంగ్లిష్ మాట్లాడే యవతీ యువకులను నియమించుకున్నారు. ఐతే ఈ ఫేక్ కాల్ సెంటర్ల విషయంలో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగడంతో వారి బాగోతం బయటకు వచ్చింది.

అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ .. భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్‌లో గతంలో నమోదైన అక్రమ ఫేక్ కాల్ సెంటర్ కేసును ఆధారంగా చేసుకుని.. ఈడీ దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!

అమెరికాకు చెందిన ప్రముఖ క్రెడిట్ కార్డ్ సంస్థలు, ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీల పేర్లు చెప్పి అమెరికా పౌరులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉద్యోగులను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

ముఠా సభ్యులు అమెరికా ప్రభుత్వ సంస్థల అధికారులు, ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ అమెరికా పౌరులకు ఫోన్లు చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేదని, ఓవర్‌డ్యూస్ ఉన్నాయని, వెంటనే చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పన్ను ఎగవేత, రుణ బకాయిల పేరుతో భయపెట్టి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించి, వాటి కోడ్‌లను తమకు బదిలీ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ కార్డులను క్రిప్టో కరెన్సీగా మార్చి సొమ్ము చేసుకుంటున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈ అక్రమ వ్యవహారంపై గతంలో సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసులను ఆధారంగా చేసుకుని ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సహా మహారాష్ట్ర, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. అహ్మదాబాద్‌లోనే మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Mahabubabad: ఆస్తి కోసం ఉన్మాదిలా.. అత్తమామలపై విద్యుత్ షాక్‌తో దాడి!

ఈ అక్రమ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న ప్రధాన నిందితులుగా మహ్మద్ అన్సారి, అకిబ్, వికాస్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్‌తోపాటు కొంత మంది అనుచరులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. వీరు దేశవ్యాప్తంగా పలు చోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. సోదాల సందర్భంగా అకిబ్ వద్ద నుంచి సుమారు 12 వేల అమెరికన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రూ.13.5 లక్షల నగదు, కంప్యూటర్లు, మొబైళ్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మోసాల వెనుక ఉన్న కొంతమంది నిందితులు.. విదేశాల్లో ఉన్నట్లు కూడా ఈడీ గుర్తించింది. వారి పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇలాంటి నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికా పౌరులను మోసం చేస్తుండడం వల్ల … ఈ తరహా నేరాలు దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తప్పవని, నెట్‌వర్క్ మొత్తాన్ని ఛేదించే దిశగా విచారణ కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon gift card scam
  • crypto fraud investigation
  • cyber fraud India call centers
  • ED raids fake call centers
  • fake call center

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions