సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
ఆ గ్రూప్‌లో ఉన్న సైబర్ నేరగాళ్లు తాము సెబి (SEBI) సర్టిఫైడ్ వెబ్‌సైట్ నడుపుతున్నామని నమ్మబలికారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని నకిలీ సెబి సర్టిఫికెట్లను కూడా పంపారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించడంతో, ఆ దంపతులు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 విడతలుగా (Transactions) వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 2.58 కోట్లు బదిలీ చేశారు. కొంత కాలం తర్వాత పెట్టుబడులు ఆపేయడంతో నేరగాళ్లు అసలు రూపం బయటపెట్టారు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని బాధితులను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగారు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలు , వాట్సాప్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే ట్రేడింగ్ చిట్కాలను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్‌లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
