Hyderabad: మరో దారుణం.. పెళ్ళి పేరుతో అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు. మరొక కేసులో.. ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
లంగర్‌హౌస్‌కు చెందిన మహ్మద్ సూఫియాన్ (21) ఈవెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి చార్మినార్ సమీపంలోని వస్త్ర దుకాణంలో పని చేస్తోన్న బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించాడు. అతని మాయమాటలకు పడిపోయిన ఆ బాలిక, అతడ్ని ప్రేమించింది. ఈనెల 30వ తేదీన రాత్రి అతడు బాలికని లంగర్‌హౌస్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మరుసటి రోజు ఆమెను తిరిగి వస్త్ర దుకాణం వద్ద వదిలేసి వెళ్లాడు. గురువారం తీవ్ర కడుపు నొప్పితో ఆ బాలిక బాధపడ్డం చూసిన తల్లి.. ఏం జరిగిందని నిలదీసింది. దీంతో, ఆ బాలిక అసలు విషయం బయటపెట్టడంతో, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?