Site icon NTV Telugu

ED Raids: మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు..

Mvv Ed

Mvv Ed

ED Raids: విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. అయితే, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌, కన్‌స్ట్రక్షన్స్‌ కార్యాలయాల్లోనూ ఈడీ రైడ్స్‌ సాగుతున్నాయి.. మధురవాడ భూమి కొనుగోలు కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు.. రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది.. ఎండీ జగదీశ్వరుడు, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్‌ ఓనర్‌ రాధారాణి ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు..

Read Also: Teaser Release : ‘భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్

ఇక, తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ… గీతాంజలి, అభినేత్రి, నీవెవరు లాంటి సినిమాలు తీశారు ఎంవీవీ.. ఈ నేపథ్యంలో 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది.. ఎంవీవీ ఆడిటర్‌ వెంకటేశ్వరరావుతో పాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు చెందిన అధికారుల బృందాలు.. అయితే సోదాల సమయంలో ఎంవీవీ ఇంటి గేటుకు తాళాలు వేశారు సిబ్బంది.. ఈ సమయంలో ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో లేరని చెబుతున్నారు.. ల్యాండ్ గ్రాబింగ్, పలు అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఈడీ అధికారుల సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది..

Exit mobile version