MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..
- ఇద్దరు కుమారులను చంపేసి స్రవంతి బలవన్మరణం
- కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు
- ప్రవీణ్ మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు
- రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన
- తాగిన మత్తులో భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MBNR + KP VISHADALU: చిన్నపాటి సంఘటనలు.. క్షణికావేశం.. లేదా మద్యంచిచ్చు.. కారణాలు ఏవైనా కావచ్చు… కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంటోంది. క్షణికావేశంలో పిల్లల్ని చంపి కుటుంబ పెద్దలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లాల్లో అలాంటి దారుణాలే జరిగాయి. వివాహేతర బంధాలు.. భార్య, భర్త మధ్య గొడవలు.. మనస్పర్థల కారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొడవల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ చాలా కేసుల్లో ఏ మాత్రం సంబంధం లేని పిల్లలను సైతం సమిధలుగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు బలవుతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలోనూ అదే జరిగింది.
కైతలాపూర్‌లో స్రవంతి అనే వివాహిత ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తీక్‌ను చంపేసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వైవాహిక జీవితంలో చాలా రోజుల నుంచి జరుగుతున్న గొడవలే దీనికి కారణంగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రవీణ్.. కొన్నాళ్ల క్రితం స్రవంతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. గత కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రవీణ్.. మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీనిపై స్రవంతి నిత్యం ప్రవీణ్‌తో గొడవపడేది. ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితంపై మానసికంగా కుంగిపోయిన స్రవంతి.. ప్రవీణ్ డ్యూటీకి వెళ్లగానే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన ప్రవీణ్, స్థానికుల సహకారంతో ఇంటికి ప్రవేశించి విషాదాన్ని చూడటంతో షాక్‌లో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం మరియు పోలీసులు మృతదేహాలను శవ పరీక్షకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తండాలో తాగిన మత్తులో ఉన్న బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో భార్య , కుమారుడు మృతి చెందగా.. కూతురు గాయాలతో ఆస్పత్రి పాలైంది. పులిగోనిపల్లి తండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాందాస్, కవిత.. ఇద్దరికి వివాహమైంది. వారిద్దరికీ నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నారు. రాందాస్ నాయక్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో పెళ్లి అయినప్పటి నుంచి తరచు భార్యాభర్తలు గొడవ పడుతుండే వారని గ్రామస్తులు అంటున్నారు. ఆ గొడవ కాస్త కుటుంబ హత్యకు దారి తీసింది. రాందాస్ నాయక్ అతి దారుణంగా కన్న పిల్లలను.. భార్యను.. కనికరం లేకుండా కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశారు. భార్య కవిత, బాబు హర్షిత్ అక్కడక్కడే మృతి చెందారు. కూతురు ప్రణీత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరోఇద్దరు అమ్మాయిలు అమ్మమ్మ గారి దగ్గర ఉండడంతో ప్రాణాలతో బతికి బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా భార్య, భర్త మధ్య నెలకొన్న విభేదాలు, గొడవల కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మరోవైపు.. స్రవంతి మృతితో ఆమె బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో బాణోత్ ప్రవీణ్ ఇంటికి వారు నిప్పు పెట్టారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!