Swiss Woman Murder: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య.. మానవ అక్రమ రవాణా కోణంలో దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్‌లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన పడేశాడు. గతంలో గురుప్రీత్ సింగ్ స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు తరుచుగా నినా బెర్గర్ని కలిసేవాడు. సీసీ టీవీ ఫుటేజ్, కార్ నెంబర్ ఆధారంగా నిందితుడు గురుప్రీత్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో మానవ అక్రమ రవాణా కోణం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నిందితుడి సెల్ ఫోన్ లో డజన్ల కొద్దీ మహిళల ఫోటోలు, కాంటాక్టులు కనుగొన్నారు. అతని ఇంటి నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలో కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
Read Also: Honour Killing: దళిత యువకుడితో పారిపోయిందని కూతుర్ని నరికి చంపిన తండ్రి..
నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మూడు తుపాకులు, మందుగుండు సామాగ్రి, 12 సిమ్ కార్డులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు. ఈ హత్యకు ముందు సెక్స్ వర్కర్ ఆధార్ కార్డు ఉపయోగించి గురుప్రీత్ కారును కొనుగోలు చేశారు. నిందితుడు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఒమెగల్ చాటింగ్ యాప్ ద్వారా నినాతో కనెక్ట్ అయినట్లు గురుప్రీత్ సింగ్ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు స్విట్జర్లాండ్ కు వెళ్లాడు. తాను నినాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అయితే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతోనే చంపానని పోలీసులకు చెప్పాడు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!