Dehradun: డెహ్రాడూన్ కారు ప్రమాదంలో వెలుగులోకి దారుణమైన అంశాలు!
- డెహ్రాడూన్ కారు ప్రమాదంలో వెలుగులోకి దారుణమైన అంశాలు!
- మృతదేహాల నుంచి వేరైనా తలలు.. నుజ్జునుజ్జు అయిన శరీరాలు
- పట్టించుకోని తల్లిదండ్రలు.. పోలీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుక్త వయసులో మంచి, చెడులు ఆలోచించే వివేచన ఉంటుంది. జీవితం ముందుకు సాగాలన్నా.. పాడు చేసుకోవాలన్నా.. యవ్వనమే టర్నింగ్ పాయింట్ అవుతోంది. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా జీవితాలను చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్లు అవుతారు. ఇదంతా ఎందుకంటారా? ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ కారు ప్రమాదం తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అసలేమైంది? డెహ్రాడూన్ కారు ప్రమాదం ఎలా జరిగింది? మృతదేహాలు శిరచ్ఛేదం ఎలా చేయబడ్డాయో తెలియాలంటే ఈ వార్త చదవండి.
సిద్ధేష్ అగర్వాల్ (25) అనే యువకుడు టయోటా ఇన్నోవా కొత్త కారు కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశాడు. ఏడుగురు స్నేహతులు బాగా మద్యం సేవించారు. పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత మంగళవారం (నవంబర్ 12) అర్ధరాత్రి 1:30కి సమయంలో లాంగ్ డ్రైవ్‌కు రెడీ అయ్యారు. విపరీతమైన వేగంతో గాల్లో దూసుకుపోతున్నారు. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు బాగా మద్యం సేవించి ఉన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో నగరంలోని ఓఎన్ జీసీ చౌక్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టారు. అంతే కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అక్కడికక్కడే ఛిద్రం అయిపోయారు. కారు పైటాప్ లేచి పోవడంతో మృతదేహాలు శిరచ్ఛేదనం అయ్యాయి. ఆరుగురు తలలు లేకుండా పోయాయి. అంతేకాకుండా శరీరాలు కూడా గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయిపోయాయి. సిద్ధేష్ అగర్వాల్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులు కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ (23), కామాక్షి (20), గునీత్ (19)గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కుక్రేజా మినహా అందరూ డెహ్రాడూన్‌కు చెందినవారే.
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
ఇదిలా ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి పిల్లలు చనిపోతే.. ఇప్పటి వరకు తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదన్న వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్‌ది తప్పులేదని తేల్చారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే యువతీ, యువకులు పార్టీ చేసుకున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!