Mumbai Crime: భరిస్తున్నారు కదా అని బాధపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే విసిగిపోయిన మనసు మనిషి ఆలోచలను వికృతంగా మారుస్తుంది. ముంబయి లోని ఓ కుటుంబంలో జరిగిన వరుస హత్యలే ఇందుకు నిదర్శనం. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శంకర్ కుంభరే, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు రోషన్ సంఘమిత్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి ఆత్మ హత్య చేసుకుని మరణించారు . తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న సంఘమిత్రకి అత్తింటి వేధింపులు ఎక్కువైయ్యాయి. ఓ వైపు తండ్రిని కోల్పోయిన బాధ. మరో వైపు అంతింటి వేధింపులతో విసిగిపోయిన సంఘమిత్ర క్రూరంగా మారిపోయింది. ఎంతగా అంటే భర్తతో సహా అంతింటి వాళ్ళందరిని చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఇంతలో తనకి రోసా అనే మహిళతో స్నేహం ఏర్పడింది.
Read also:Israeli–Palestinian Conflict: గాజాకు ఈజిప్ట్ సహాయం..
ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి విషం కొనుగోలు చేసింది సంఘమిత్ర. ఆ విషాన్ని నీటిలో కలిపి అత్తింటి వారికి ఇచ్చింది. మొదట సెప్టెంబర్ 20వ తేదీన శంకర్ కుంభరే, అతని భార్య విజయ అనారోగ్యం పాలయ్యారు. కాగా సెప్టెంబర్ 26వ తేదీన శంకర్ మరణించగా మరుసటి రోజు అతని భార్య విజయ మృతి చెందింది. అనంతరం శంకర్ కుమార్తెలు కోమల్, ఆనంద , కుమారుడు రోషన్ ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 8వ తేదీన కోమల్, 14వ తేదీన ఆనంద, 15వ తేదీన రోషన్ మరణించారు. తల్లిదండ్రులను చూడడానికి ఢిల్లీ నుండి వచ్చిన శంకర్ పెద్ద కుమారుడు సాగర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు, అలానే సాగర్ కార్ డ్రైవర్, శంకర్ వాళ్ళని చూడడానికి వచ్చిన బంధువు కూడా అనారోగ్యానికి గురైయ్యారు. దీనితో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలల్లో కలకలం రేపింది.
Read also:Off The Record: సీఎం జగన్ తో ఆ మాజీ మంత్రి మీట్ అయ్యేది అందుకేనా…?
ఈ నేపథ్యంలో పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగు చూసింది. అత్తింటి వాళ్ళ ఆరళ్లకు విసుగ్గు చెందిన ఆయింటి చిన్న కోడలు సంఘమిత్ర, స్నేహితురాలు రోసా తో కలిసి అత్తింటివారిని హతమార్చింది. అయితే ప్లాన్ ప్రకారమే తన భర్తకు రావాల్సిన ఆస్థిని ముందుగానే తన పేరు మీద రాయించుకుంది. అనంతరం హత్యలు చేయడం ప్రారంభించింది. కోడలి కక్షకు 3 వారాలలో 5 మంది పండుటాకుల్లా రాలిపోయారు.