NTV Telugu Site icon

Cyber ​​Crime: ముంబై బ్లాస్ట్‌ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపు.. రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ..

Cyber Crime

Cyber Crime

Cyber ​​Crime: సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్‌ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.

Read Also: KA : కిరణ్ అబ్బవరం పడే కష్టానికి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి.. రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు.. అయితే, నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అధికారుల మంటూ మస్తాన్ వలికి కాల్‌ చేశారు సైబర్ నేరగాళ్లు.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరింపులకు దిగారు.. ఈ కేసులో అరెస్ట్ చేస్తామని మస్తాన్‌ వలికి వార్నింగ్‌ ఇచ్చారు.. అయితే, వెంటనే అరెస్టు చేయకూడదంటే కొంత డబ్బు తమకు ముట్టచెప్పాలని బేరం పెట్టారు.. ఇదంతా నిజమేనని భయంతో వణికిపోయిన మస్తాన్‌ వలి.. పలు దఫాలుగా 72 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు.. ఇక, తాను తీరా మోసపోయానని గ్రహించిన బాధితుడు.. గుత్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

Show comments